Mancherial: దివ్యాంగుల సేవలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు

Mancherial: మంచిర్యాల జిల్లాలో దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం. గడువు ఈ నెల 16.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 7 Nov 2026 5:59 PM IST
Mancherial
X

Mancherial: దివ్యాంగుల సేవలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు

మంచిర్యాల: దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. ఈ మేరకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి, సాధికారత కోసం విశేష సేవలందించిన ఉత్తమ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాలతో సత్కరిస్తారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం సేవలందిస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తు నమూనా, అర్హతలు, పురస్కారాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను "ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్" (https://depwdsctgp.telangana.gov.in)లో పొందవచ్చని తెలిపారు.

అర్హులైన వారు నిర్దేశిత నమూనాలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 16వ తేదీలోగా మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని రౌఫ్ ఖాన్ కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.