Mancherial: ఎస్ఐఆర్-2026 ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి - యోగితా రాణా
Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించిన ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా, కలెక్టర్ కుమార్ దీపక్.
Mancherial: ఎస్ఐఆర్-2026 ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి - యోగితా రాణా
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్–2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు, ఎలక్టోరల్ అధికారులతో కలిసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు సంబంధించి 1.70 లక్షల నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటికే 1.10 లక్షల నోటీసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 60 వేల నోటీసుల పంపిణీకి చర్యలు కొనసాగుతున్నాయి.
18 ఏళ్లు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని యోగితా రాణా సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల డాక్యుమెంట్లలో సంబంధిత ఆధారాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం నస్పూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.




