Mancherial: ముగ్గురికి మూడు హెల్మెట్లు.. మంచిర్యాల ట్రాఫిక్ ఎస్‌ఐ అభినందన!
Mancherial: మంచిర్యాల–బెల్లంపల్లి చౌరస్తాలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు ధరించి వెళ్లడాన్ని గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ రాములు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Mancherial: ముగ్గురికి మూడు హెల్మెట్లు.. మంచిర్యాల ట్రాఫిక్ ఎస్‌ఐ అభినందన!
మంచిర్యాల: రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతున్న కొద్దీ బాధ్యతాయుత ప్రయాణానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నప్పటికీ, ముగ్గురూ హెల్మెట్లు ధరించి వెళ్లడం ట్రాఫిక్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. మంచిర్యాల–బెల్లంపల్లి చౌరస్తాలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురూ హెల్మెట్లు ధరించి ఉండటాన్ని గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ రాములు వారిని అభినందించారు.
హెల్మెట్ ధరించడం పట్ల వారు చూపిన శ్రద్ధను ప్రశంసిస్తూ, రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ రాములుతో పాటు ఏఎస్ఐ జగన్, కానిస్టేబుల్ ప్రదీప్ పాల్గొన్నారు. హెల్మెట్ అలంకారం కాదు.. ప్రాణ రక్షణ కవచం. రహదారిపై మన భద్రతే మన కుటుంబానికి భరోసా హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి! సందేశాన్ని ఇచ్చారు.




