Manchiryala: భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల్లో రఘునాథ్ వెరబెల్లి
Manchiryala: మంచిర్యాలలో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
Manchiryala: భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల్లో రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల: ఆదివాసీ ఆరాధ్య దైవం, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భగవాన్ బీర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎస్టీ మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




