Mancherial: పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి: విశ్రాంత ఉద్యోగులు

Mancherial: మందమర్రి యూనియన్ బ్యాంకు ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ధర్నా చేపట్టింది. 70 ఏళ్ల లోపు పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమాపై మేనేజర్ సానుకూలంగా స్పందించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 3:42 PM IST
Mancherial
X

Mancherial: పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి: విశ్రాంత ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా: మందమర్రి యూనియన్ బ్యాంకు ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న 70 సంవత్సరాల లోపు సింగరేణి బొగ్గు పెన్షనర్లకు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

2004లో సింగరేణి సంస్థ, యూనియన్ బ్యాంకు యాజమాన్యం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అర్హులైన పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందని సంఘం నాయకులు తెలిపారు. అయితే కొంతమంది బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

అనంతరం మందమర్రి యూనియన్ బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై మేనేజర్ సానుకూలంగా స్పందిస్తూ, బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న 70 సంవత్సరాల లోపు సింగరేణి బొగ్గు పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే, ఒప్పందం మేరకు వారి కుటుంబాలకు రూ.30 లక్షల ప్రమాద బీమా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.

అలాగే బ్యాంకులో వృద్ధులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వాష్‌రూమ్ సౌకర్యం కల్పించాలని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై కూడా మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.

మేనేజర్ సానుకూలంగా స్పందించడంపై సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, మందమర్రి ఏరియా నాయకుడు రాం రవేందర్, ఆర్. కొమురయ్య, మడవొని శంకర్, బచ్చల భీమయ్య, సీహెచ్. నారాయణ, ఎన్. శివానందన్, పి. సమయ్య, శ్రీరాంపూర్ ఏరియా నాయకులు దండు రాజమౌళి, కేంద్ర కమిటీ నాయకుడు పోతురాజుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.