Mancherial: మందమర్రి మోడల్ స్కూల్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం!
Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి మోడల్ స్కూల్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి.
Mancherial: మందమర్రి మోడల్ స్కూల్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం!
Mancherial: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మందమర్రి మోడల్ స్కూల్‌లో మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, చదువుపై మరింత శ్రద్ధ చూపేలా ప్రోత్సహించడమే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పౌష్టికాహారం అందించడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ విద్యలో మరింత చురుకుగా రాణించే అవకాశం ఉంటుందని అన్నారు.
“ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకునే అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తాం” అని మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




