Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్ చేసిన మంత్రి!

Chennur: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల అర్జీల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్స్.. పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

RAJENDER, CHENNUR
Published on: 5 Sept 2026 1:32 PM IST
Chennur
X

Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్ చేసిన మంత్రి!

Chennur: చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌ను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ రోజు ఓపెన్ చేశారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుల బాక్స్‌లో ప్రజలు సమర్పించిన వినతులు, ఫిర్యాదులను మంత్రి పరిశీలించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అందజేసిన వినతులను పరిశీలించి, సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ తెలిపారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు వీలుగా ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి అన్నారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి, ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story