Jaipur: జైపూర్ మండలంలో హోరెత్తిన కాంగ్రెస్ బైక్ ర్యాలీ మంత్రి వివేక్ హాజరు!

Jaipur: కాంగ్రెస్ 1000 రోజుల పాలన జైపూర్ మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి వివేక్, అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్.

RAJENDER, CHENNUR
Published on: 5 Sept 2026 2:31 PM IST
Jaipur
X

Jaipur: జైపూర్ మండలంలో హోరెత్తిన కాంగ్రెస్ బైక్ ర్యాలీ మంత్రి వివేక్ హాజరు!

Jaipur: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో బైక్ ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక & గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్ మండలంలో సంబరాలు నిర్వహించారు.

అనంతరం, బైకులతో బైక్ ర్యాలీలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కెసిఆర్ అసెంబ్లీ కి రావాలి.కాళేశ్వరం ఎందుకు కుంగి పోయిందో సమాధానం చెప్పాలి. అపోజిషన్ లీడర్ గా జీతాలు తీసుకుంటున్నాడు.ప్రజల సమస్యల పై అసెంబ్లీకి వచ్చి పోరాడాలి.

కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడు. కేసీఆర్ అసెంబ్లీ కి రావాలి, లేదంటే రాజీనామా చేయాలని మండిపడ్డారు. మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టిన 600 కోట్ల కాలేశ్వరం రూపాయలపై క్రిప్కో పై అసెంబ్లీలో చర్చ చేయాలి.

గత ప్రభుత్వ హయంలో పది యేండ్ల లో ఒక్క సింగరేణి మైన్ తీసుకురాలేదు. నేను ఎమ్మెల్యే అయ్యక ఒక ఆర్కే ఓసిపి మైన్ తీసుకు రావడం జరిగింది. జైపూర్ STPP లో అదనంగా 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. చెన్నూరు లో అతి త్వరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం జరుగుతుంది.

అభివృద్ధిలో చెన్నూరు నియోజకవర్గం ముందంజ లో ఉంది అని చాణక్య రిపోర్ట్ కూడా ఇచ్చారు. చెన్నూరు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే చెన్నూరు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story