Mancherial: చెన్నూరు గణేష్ శోభాయాత్రలో మంత్రి వివేక్ వెంకటస్వామి!

Mancherial: చెన్నూరులో వైభవంగా వినాయక నిమజ్జనం: శోభాయాత్రలో పాల్గొని విగ్రహాలను నిమజ్జనం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు.

RAJENDER, CHENNUR
Published on: 23 Sept 2026 11:32 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరు గణేష్ శోభాయాత్రలో మంత్రి వివేక్ వెంకటస్వామి!

మంచిర్యాల జిల్లా: జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక మండపాల వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.

చెన్నూరు పట్టణంలో వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర లో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు పాటు పూజలందుకున్న లంబోదరుడిని సాగనంపేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కాషాయ జెండాలు, తోరణాలతో అంతా కాషాయమాయంగా మారిపోయింది. భక్తుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో మారుమోగాయి. వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన మహోత్సవంలో పాల్గొని వినాయక విగ్రహాలను మంత్రి వివేక్ తానే స్వయంగా చెరువులో నిమజ్జనం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాట్లు పూర్తి చేశారు. మునిసిపల్ అగ్నిమాపక వైద్య శాఖల అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంత్రి వివేక్ కామెంట్స్...!

చెన్నూరు నియోజకవర్గంలో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాను. ఇప్పటికే పుష్కరాల పనులు ప్రారంభం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

పెద్ద చెరువులో నిర్మిస్తున్న శివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి 17 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని, రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. రోడ్డు వెడల్పులో ఉపాధి కోల్పోయిన వారికి పట్టణంలో షాపులు కట్టించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

గత ప్రభుత్వంలో రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయిన వారికి ఇప్పటివరకు కూడా షాపులు కేటాయించలేదు, కానీ నేను వారికి కూడా షాపులు కట్టించి ఇస్తానని తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR