Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో వైభవంగా మంత్రి వివేక్ దసరా వేడుకలు!
Chennur: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు. ఆయుధ, వాహన, శమీ పూజల్లో పాల్గొన్న మంత్రి.
Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో వైభవంగా మంత్రి వివేక్ దసరా వేడుకలు!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అత్యంత వైభవంగా విజయదశమి దసరా వేడుకలను నిర్వహించారు.సతీసమేతంగా దసరా పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు.
సంప్రదాయబద్ధంగా పండితుల వేద మంత్రాల మద్య శాస్త్రోక్తంగా దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించి, అనంతరం శమీ పూజ (జమ్మి పూజ) చేసి బంగారం వంటి జమ్మి ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకున్నరు.
క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, చెన్నూరు ప్రజలు అందరికీ మంత్రి వివేక్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి వివేక్ వెంకటస్వామి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను ప్రజలు జరుపుకుంటారు అని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని మంత్రి వివేక్ ఆకాంక్షించారు.
నియోజకవర్గ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా మంత్రి వివేక్ పిలుపునిచ్చారు.




