Jaipur: జైపూర్‌లో మంత్రి వివేక్ పర్యటన.. ఆధునిక బాక్స్ క్రికెట్ కోర్టు ప్రారంభం!

Jaipur: మంచిర్యాల జిల్లా జైపూర్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాక్స్ క్రికెట్ కోర్టు ప్రారంభించి, విద్యార్థులకు ఆస్ట్రో టర్ఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

RAJENDER, CHENNUR
Published on: 6 Nov 2026 3:25 PM IST
Jaipur
X

Jaipur: జైపూర్‌లో మంత్రి వివేక్ పర్యటన.. ఆధునిక బాక్స్ క్రికెట్ కోర్టు ప్రారంభం!

మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలో పర్యటించిన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

జైపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆధునిక బాక్స్ క్రికెట్ కోర్టును మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. పాఠశాల విద్యార్థుల కోసం అధునాతన ఆస్ట్రో టర్ఫ్ (AstroTurf) మైదానం, ఉచిత క్రికెట్ కిట్లను మంత్రి వివేక్ మంజూరు చేశారు.

అనంతరం, జైపూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి చెక్కులు పంపిణీ చేశారు.

చదువుతో పాటు ఆటల్లోనూ విద్యార్థులు రాణించాలని, గ్రామీణ ప్రతిభను వెలికితీయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, కార్మికులు, పేద విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ...! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా కారులకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులు కోరినట్లు ఒక క్రికెట్ కోర్టు, ఒక ఆస్ట్రో టాఫ్ మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా ఆడి మంచి స్థానాలు పొందాలని ఈ సందర్భంగా మంత్రిగా ఆకాంక్షించారు.

నేను చిన్న తనంలో క్రికెట్ ఆడేవాడిని, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బారి స్కోర్ నాదే ఉండేది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేను క్రీడాకారుడిగా ఉన్నందున మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మీ అందరికీ మంచి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అందిస్తుందని తెలిపారు.

మీరందరూ బాగా చదువుకొని మంచి స్థానాల్లో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి వివేక్ ఆకాంక్షించారు. మన ఎంపీ వంశీ కృష్ణ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ బ్యాగ్స్ అందించే కార్యక్రమం తీసుకున్నారు.

వచ్చే వారం ఇక్కడ మన పాఠశాలలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసుకోవడం జరుగుతుందని, విద్యార్థులు అందరూ ఎంతో క్రమశిక్షణతో ఉండి మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని అలాగే తమ తల్లిదండ్రులను, పాఠశాలల్లోని అధ్యాపకులను గౌరవించాలని మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR