Kotapalli: మోడల్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి వివేక్!

Kotapalli: మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్‌లో అల్పాహార పథకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 18 Nov 2026 11:54 AM IST
Kotapalli
X

Kotapalli: మోడల్ స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి వివేక్!

Kotapalli: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

ఉదయం పూట ఆకలితో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల హాజరు శాతంతో పాటు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. 2009లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే మోడల్ స్కూళ్ల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి చదవాలని, మంచి ఫలితాలు సాధించిన వారికి బహుమతులు అందిస్తానని ప్రకటించారు. కోటపల్లి మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

చెన్నూరు నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని, చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.

అల్పాహార పథకం ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యత, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.