Chennur: చెన్నూరులో రూ. 75 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ భూమిపూజ!
Chennur: చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: రూ. 75 లక్షల కమ్యూనిటీ భవన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్.
Chennur: చెన్నూరులో రూ. 75 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ భూమిపూజ!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృత స్థాయిలో పర్యటించారు. చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో 2 కమ్యూనిటీ భవనాలకు మంత్రి వివేక్ భూమి పూజ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో శరవేగంగా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
కావాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక గొప్ప ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మంత్రి వివేక్ కామెంట్స్...! పది రోజుల జపాన్ పర్యటన తర్వాత చెన్నూరు నియోజకవర్గానికి వచ్చాను.
చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వాన్నంగా ఉండేవి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుండి నియోజకవర్గం లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులు చేసాను. గతంలో చెన్నూరు నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు కనీసం నిధులు మంజూరు చేయలేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం పేరుకే శంకుస్థాపనలు చేసి కొబ్బరి కాయలు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ లకు నిధులు చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేను ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గ రూపు రేఖలు మార్చాలని తీవ్రంగా కృషి చేస్తున్నాను.
ముఖ్యంగా చెన్నూరు పట్టణంలోని రోడ్డు వెడల్పు పనుల్లో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూల్చివేతలు చేసుకుంటున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో ఎవరైతే దుకాణాలు, ఉపాధి కోల్పోతున్నారో వారికి మళ్లీ షాప్స్ కట్టించి ఇవ్వడం జరుగుతుంది. మంచి నీటి పథకంలో భాగంగా 30 కోట్ల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయి.
జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భవన పనులకు నిధులు ఇవ్వడం జరిగింది. చెన్నూరు పట్టణాన్ని ఒక అధునాతన మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాను. వచ్చే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల్లో భాగంగా సుమారు 70 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభం అవుతాయి.
బీజేపీ నేతలు మొన్న తప్పుడు ఆందోళనలు చేశారు. ఇక్కడ ప్రజాపాలన జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో బోల్డోజర్ పాలన బీజేపీ చేస్తుంది. కావాలనే బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గోదావరికి వెళ్లడానికి 10 వ వార్డులో రోడ్డు వెడల్పు కోసం 6 కోట్లు మంజూరు చేయడం జరుగుతుంది.
పట్టణంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి 2 కోట్ల నిధులు మంజూరు చేసాము. చెన్నూరు లో టూరిస్ట్ సెంటర్ గా ఏర్పాటు చేయడానికి 17 కోట్ల నిధులతో రూపకల్పన చేయడం జరుగుతుంది. ఈ రోజు చెన్నూరు పట్టణంలో 3 కమ్యూనిటీ భవనాలకు సుమారు 75 లక్షల నిధులతో భూమిపూజ చేసుకున్నాము.
జోడువాగులు వద్ద మన ఎంపీ వంశీ కృష్ణ ఫాలో అప్ చేసి పనులకు 100 కోట్ల నిధులు శాంక్షన్ చేసుకున్నారు. టెండర్ ప్రక్రియ జరుగుతుంది త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. చెన్నూరు బస్సు డిపో చెన్నూరు ప్రజల చిరకాల కళ, డిపో పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆగిపోయింది.
నేను వచ్చాక ఆ పనులను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ఈ నెలలో ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 23 మంది డాక్టర్లు మనకు రావడం జరిగింది.




