Mancherial: ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్: మంత్రి వివేక్!
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
Mancherial: ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్: మంత్రి వివేక్!
మంచిర్యాల జిల్లా: జైపూర్ మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్టించిన కొమురం భీమ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన పోరాట ప్రతిమ, వీరుడు కొమురం భీమ్ అని కొనియాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి. సొంత నిధులతో కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న స్థానిక యువతను ఆదర్శంగా పేర్కొంటూ వారిని మంత్రి వివేక్ అభినందించారు. ఎక్కడైనా భీమ్ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వస్తే ఆర్థిక సహాయం అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్ద ఎత్తున హాజరైన ఆదివాసి సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి యువత ఇలాగే అందరికీ ఆదర్శంగా ఉండి విగ్రహాన్ని స్వంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలిపారు. ఎవరైనా కొమురం భీం విగ్రహం పెట్టుకుంటే నేను ఆర్థిక సహాయం చేస్తాను అని మంత్రి పేర్కొన్నారు.
ఆదివాసి హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమురం భీం అని, ఆయన ఒక గొప్ప పోరాట ప్రతిమ గల నాయకుడని ఈ సందర్భంగా ఆయన పోరాటం ప్రతిమలను గుర్తు చేసుకున్నారు. ఆదివాసి వర్గాల వారికి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరకు రండి నేనే సమస్య సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ తెలిపారు. తమకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి భూమి కావాలని ఆదివాసీ నాయకులు తనను కోరారని, అందుకు వెంటనే స్పందించి స్థానిక ఎమ్మెర్వో కి ఈ విషయంపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అర్హులైన వారు ఎవరు ఉన్నా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇందిరా గాంధీ హయాంలో పేదల కోసం ఇండ్లు, భూమి ఇవ్వడం జరిగిందని. చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 1000 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి స్థాయిలో అయ్యాయని వివరించారు. పది సంవత్సరాలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసింది.
ఆగస్ట్ 15 నుండి కొత్త పెన్షన్ పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీ సెంటర్ లను ఏర్పాటు చేసుకున్నాము. జర్మన్ భాష నేర్చుకొని మన యువత విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నార తెలిపారు.




