Bellampalli: ఘనంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముందస్తు జన్మదిన వేడుకలు!
Bellampalli: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముందస్తు జన్మదిన వేడుకలు. హాజరైన నాయకులు, కార్యకర్తలు.
Bellampalli: ఘనంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముందస్తు జన్మదిన వేడుకలు!
Bellampalli: ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా క్యాంపు కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




