Bellampally: ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు: ఎమ్మెల్యే గడ్డం వినోద్
Bellampally: బెల్లంపల్లి 6వ వార్డులో లబ్ధిదారు కవిత నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Bellampally: ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు: ఎమ్మెల్యే గడ్డం వినోద్
Bellampally: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో ఈ ఏడాది దీపావళి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటిని నిర్మించుకున్న కుటుంబాలు తమ కొత్త ఇంట్లో తొలి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలోని 6వ వార్డులోనీ లబ్ధిదారు కవిత నూతన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ దావా స్వాతి రమేష్, వైస్ చైర్మన్ సతీష్ , పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నూతన గృహాన్ని ప్రారంభి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరిన వేళ వారితో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తూ ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అభినందనీయమన్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నిండాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు... ఇందిరమ్మ ఇంటికి ఇంత బాగా నిర్మించుకున్నందుకు ఇంటి యజమానులను అభినందించారు.. బెల్లంపల్లిలో సాధ్యమైనంతవరకు పేద వారందరూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు..
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ తమ ఎన్నో ఏళ్ల కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. సొంతింటిలో తొలి దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమ కుటుంబాల్లో ఆనందం నింపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.




