Mancherial: మంచిర్యాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు వేడుకలు. జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 21 Sept 2026 11:29 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంచిర్యాల జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పథకం ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలరని, పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యానికి తోడ్పాటు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రేమ్ సాగర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు కేక్ కట్ చేసి సీట్లు పంచుకున్నారు ఎమ్మెల్యేకు కార్యక్రమం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.