Kagaznagar: సిర్పూర్ నియోజకవర్గంలో వైద్య విప్లవం.. ఎమ్మెల్యే హరీష్

Kagaznagar: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సహకారంతో కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 15 పడకల ఐసీయూను ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 21 April 2026 5:29 PM IST
Kagaznagar
X

Kagaznagar: సిర్పూర్ నియోజకవర్గంలో వైద్య విప్లవం.. ఎమ్మెల్యే హరీష్

Kagaznagar: కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారి సహకారంతో మంజూరైన 15 ఐసీయు పడకలతో ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. అలాగే 10 కొత్త స్ట్రెచెర్ బెడ్స్ ను కూడా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలల్లో కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రి మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించిందని, రోజుకు 300 మంది అవుట్ పేషెంట్ రోగులు మరియు 20 మంది ఇన్ పేషంట్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. సగటున ప్రతినెలా 50కి తక్కువ కాకుండా నార్మల్ డెలివరీలను నిర్వహిస్తున్నారన, వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు విరివిగా ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకం అయిన కాయకల్ప స్కీమ్ కింద ఈ ఆసుపత్రి ఎంపిక అయ్యే అవకాశం ఉందని, దానికోసం వైద్యులు మరియు వైద్య సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.100 పడకల నూతన ఏరియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం కూడా శరవేగంగా సాగుతుందని, తద్వారా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు.

కాగజ్ నగర్ పట్టణంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఇదివరకే ఉందని, తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారిని పలుమార్లు కలిసి విన్నవించడం మరియు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఉటంకించడంతో కాగజ్ నగర్ పట్టణంలో అదనంగా 5 డయాలసిస్ పడకలు, సిర్పూర్లో 5 డయాలసిస్ పడకలు, కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 పడకలు మరియు బెజ్జూర్ సామాజిక ఆసుపత్రిలో 5 పడకలు కొత్తగా మంజూరయ్యాయని తెలిపారు. దీని వల్ల ప్రస్తుతం నియోజక వర్గంలో ఉన్న కిడ్నీ రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని అన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story