Penchikalpet: పెంచికల్‌పేట స్కూల్లో మాక్ అసెంబ్లీ: అదరగొట్టిన విద్యార్థులు!
Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అసెంబ్లీ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
Penchikalpet: పెంచికల్‌పేట స్కూల్లో మాక్ అసెంబ్లీ: అదరగొట్టిన విద్యార్థులు!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పెంచికల్పేట మండలంలోని విద్యార్థులకు శాసనసభలో ప్రజా ప్రతినిధులు ఏ విధంగా ప్రజల సమస్యలను లేవనెత్తుతారో, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వం యొక్క పనితీరు మరియు ప్రతిపక్షం యొక్క ప్రశ్నోత్తర సమయంలో ఏ విధంగా ప్రజాప్రతినిధులు ప్రతిస్పందిస్తారో తెలుసుకోవడానికి పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈశ్వర్ రావు సహకారంతో ఈ మార్క్ అసెంబ్లీ జడ్.పి.హెచ్.ఎస్ పెంచికలపేట పాఠశాల నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయనిర్మల మరియు సీనియర్ ఉపాధ్యాయులు యాదగిరి మరియు ఉపాధ్యాయ బృందం: గంగాభవాని, లక్ష్మీ, సంతోష్, భారతి, ఉజ్వల, ఈశ్వర్ రావు, ఆత్మరాం, విజయ్, మౌనిక, ఉత్తర్ సింగ్, ఇస్మాయిల్ మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.




