Sirpur: సిర్పూర్ పేపర్ మిల్స్‌లో క్లోరిన్ మాక్ డ్రిల్ నిర్వహణ
Sirpur: సిర్పూర్ పేపర్ మిల్స్‌లో క్లోరిన్ లీకేజీపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా అవగాహన కల్పించారు.
Sirpur
Sirpur: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్స్‌లో క్లోరిన్ లీకేజీ పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. హరిత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో క్లోరిన్ వాయువు లీకేజీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సిర్పూర్ పేపర్ మిల్స్ ఉద్యోగులకు భద్రతా చర్యలపై ప్రత్యేక శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని సూచించారు. లక్ష్మీకుమారి మాట్లాడుతూ, సేఫ్టీపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
సిర్పూర్ పేపర్ మిల్స్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) ఏ.కే. మిశ్రా మాట్లాడుతూ, సేఫ్టీ మేనేజ్‌మెంట్ సంస్థలో అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్ ఆర్. శ్రీనివాస్, జీఎం (కమర్షియల్) ఎం. అనిల్ కుమార్, జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్ & ఐఆర్) ఎం.ఎస్. గిరి తదితరులు పాల్గొన్నారు.




