Mancherial: చెన్నూరులో నూతన బజాజ్ పల్సర్ 125cc బైక్ ఆవిష్కరణ!

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శ్రీలక్ష్మి మోటార్స్‌లో సరికొత్త బజాజ్ పల్సర్ 125cc బైక్‌ను షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్సై ఉషారాణి ఆవిష్కరించిన వివరాలు.

RAJENDER, CHENNUR
Published on: 9 Sept 2026 9:43 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరులో నూతన బజాజ్ పల్సర్ 125cc బైక్ ఆవిష్కరణ!

Mancherial: చెన్నూరు పట్టణంలోని శ్రీలక్ష్మి మోటార్స్ బజాజ్ షోరూం లో నూతన బజాజ్ పల్సర్ వాహనాలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా షీ టీం ఇన్చార్జ్ ఎస్సై భూపతి ఉషారాణి చేతుల మీదుగా నూతన పల్సర్ 125cc బైక్ ను ఆవిష్కరించారు. బజాజ్ లో కొత్తగా వస్తున్న పల్సర్ 125 సిసి బైక్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని భూపతి శ్రీనివాస్ తెలిపారు.

ఈ కొత్త బజాజ్ పల్సర్ లో ఆల్ న్యూ లుక్ తో వస్తుందని, ఇందులో డిజిటల్ స్క్రీన్, మోనో సస్పెన్షన్ వంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా, యువతను ఎంతో అట్రాక్ట్ చేసే విధంగా కొత్త లుక్స్, మరెన్నో అప్డేట్స్ తో ఈ కొత్త బజాజ్ పల్సర్ బైకును పూర్తిగా అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీం ఇన్చార్జ్ ఎస్సై భూపతి ఉషారాణి, మంచిర్యాల జిల్లా బైక్ మెకానిక్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్, చెన్నూరు బజాజ్ షోరూం యజమాని భూపతి శ్రీనివాస్ వారి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story