Asifabad: విద్యుత్ సిబ్బందికి భద్రతా పాఠాలు.. కౌటాలలో కీలక సదస్సు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో విద్యుత్ ఓ అండ్ ఎం సిబ్బంది, ఆర్టిజన్లు, కాంట్రాక్టర్లకు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

SRINIVAS, KOUTALA
Published on: 10 Sept 2026 8:52 PM IST
Asifabad
X

Asifabad: విద్యుత్ సిబ్బందికి భద్రతా పాఠాలు.. కౌటాలలో కీలక సదస్సు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాలా సబ్-డివిజన్ పరిధిలోని O&M సిబ్బంది, ఆర్టిజన్లు, అన్‌మ్యాన్డ్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లతో భద్రతా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్, డీఈ (టెక్ & సేఫ్టీ ఆఫీసర్) అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సుధాకర్ డీఈ (టెక్ & సేఫ్టీ ఆఫీసర్), వీరేశ డివిజనల్ ఇంజనీర్, ఇర్ఫాన్ అహ్మద్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, అంజల్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్,ప్రశాంత్ కుమార్, శ్రీ అజయ్, మీనా సబ్-ఇంజనీర్లు.

ఈ సందర్భంగా విద్యుత్ భద్రత, సురక్షిత పని విధానాలు, భద్రతా నియమాల పాటింపు మరియు విద్యుత్ ప్రమాదాల నివారణ వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story