Asifabad: ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో భూ సమస్యపై వృద్ధుడు ఆత్మహత్యాయత్నం!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోరుతూ వృద్ధుడు మల్లయ్య ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు, ఆర్డీవో హామీ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 28 Sept 2026 1:36 PM IST
Asifabad
X

Asifabad: ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో భూ సమస్యపై వృద్ధుడు ఆత్మహత్యాయత్నం!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అసిఫాబాద్ మండలం చోర్‌పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు.

మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తమకు సంబంధించిన భూమిలో కొంత భాగాన్ని కుమారుడు, కుమార్తె పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, అనంతరం వారు తమను పట్టించుకోవడం లేదని మల్లయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము చేసిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అయితే తమ ఫిర్యాదులపై న్యాయం జరగలేదని ఆవేదనతో మల్లయ్య కలెక్టరేట్‌లో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న ఆర్డీవో వెంటనే అక్కడికి చేరుకుని మల్లయ్యతో మాట్లాడారు. ఇప్పటికే కేసు పెట్టారని, సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.