Sirpur: రెవెన్యూ సమస్యల తక్షణ పరిష్కారం అభినందనీయం: ఎమ్మెల్యే హరీష్ బాబు

Sirpur: సిర్పూర్ (టి) లో సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొని పట్టాలు అందజేశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 10 Nov 2026 6:30 PM IST
Sirpur
X

Sirpur: రెవెన్యూ సమస్యల తక్షణ పరిష్కారం అభినందనీయం: ఎమ్మెల్యే హరీష్ బాబు

కొమరం పులి జిల్లా సిర్పూర్(టి): మండల కేంద్రంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి, IAS ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సమస్యల పరిష్కార సమావేశంలో పాల్గొని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సబ్ కలెక్టర్ అభినందించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా పలువురికి డీఎస్ పెండింగ్ సమస్యలను పరిష్కరించి పట్టాలు అందజేయడం జరిగింది. అన్ని మండల కేంద్రాల్లో ఇటువంటి రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రహీముద్దీన్, సర్పంచ్ ఒడ్డేటి నాగమణి నన్నయ్య, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR