Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో ఉపసర్పంచ్‌ల ఫోరం భారీ నిరసన..

Mancherial: జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యకు ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అనుమండ్ల విక్రమ్ గౌరవ వేతనం, బీమా కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 28 July 2026 11:20 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో ఉపసర్పంచ్‌ల ఫోరం భారీ నిరసన..

మంచిర్యాల్, జూలై 28: గ్రామ పంచాయతీల్లో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆదేశాల మేరకు మంగళవారం మంచిర్యాల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనుమండ్ల విక్రమ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు కనీస గౌరవ వేతనం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఉపసర్పంచ్‌లకు నెలకు ₹5,000, వార్డు సభ్యులకు ₹3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదానికి గురైనా ఉపసర్పంచ్‌లకు ₹5 లక్షలు, వార్డు సభ్యులకు ₹3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల పేర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు.

డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు అందజేసిన నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రవీందర్, జిల్లా ఉపాధ్యక్షురాలు స్రవంతి, మండల అధ్యక్షులు, జిల్లాలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story