Asifabad: ఎల్కపల్లిలో వరి పంటలను పరిశీలించిన ఏవో రామకృష్ణ!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లిలో ఏవో రామకృష్ణ వరి పంటలను పరిశీలించి, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై సూచనలు చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 5 Oct 2026 6:20 PM IST
Asifabad
X

Asifabad: ఎల్కపల్లిలో వరి పంటలను పరిశీలించిన ఏవో రామకృష్ణ!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట, మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పంట పరిస్థితిని పరిశీలించి, రైతులతో మాట్లాడి సాగులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

వరి పంటలో తెగుళ్ల నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆయన సూచించారు. రసాయన నివారణలో భాగంగా లీటరు నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లాజోల్ లేదా ఎకరానికి 120 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.

అలాగే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండైజిమ్ లేదా అజోక్సీస్ట్రోబిన్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. పంటను క్రమం తప్పకుండా గమనిస్తూ తెగుళ్ల లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రామకృష్ణ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ఏఈఓ శ్రీవిద్య మరియు రైతులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA