Penchikalpet: వినాయక మండపాల వద్ద పోలీసుల ప్రత్యేక నైట్ పెట్రోలింగ్
Penchikalpet: పెంచికల్‌పేట్‌లో వినాయక మండపాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు. ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్, ఆకతాయిలపై నిఘా.
Penchikalpet: వినాయక మండపాల వద్ద పోలీసుల ప్రత్యేక నైట్ పెట్రోలింగ్
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎస్సై అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో రాత్రి మండపాల వద్ద ప్రత్యేక నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
ప్రధాన కూడళ్లు, రహదారులతో పాటు వినాయక మండపాల పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా యువత, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్సై అనిల్‌కుమార్ సూచించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మండపాల వద్ద ప్రత్యేక పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.




