Mancherial: చెన్నూర్‌లో పోలీసుల కార్డన్ సర్చ్.. గుడుంబా విక్రేతల అరెస్ట్, బైకులు సీజ్!

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 28 Oct 2026 12:02 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూర్‌లో పోలీసుల కార్డన్ సర్చ్.. గుడుంబా విక్రేతల అరెస్ట్, బైకులు సీజ్!

Mancherial: చెన్నూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని లైన్ గడ్డ లో గల ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.

తనిఖీలలో భాగంగా అక్రమంగా గుడుంబా మరియు లిక్కర్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు ఆశ లచ్చన్న మరియు ఆశ కిష్టయ్య లను పట్టుకొని లచ్చన్న వద్ద నుండి 3 లీటర్ల గుడుంబాను మరియు కిష్టయ్య వద్ద నుండి 90 ML చీప్ లిక్కర్ బాటిల్స్-40 లను స్వాధీన పర్చుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది. సరైన వాహన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో ను సీజ్ చేసి స్పాట్ చలాన్ విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు.

అసాంఘిక కార్యక్రమాలు ఎవరు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనడమే గాక వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. అలాగే కాలనీలో అక్రమంగా ఎవరైనా గుడుంబా అమ్మిన సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయి.

ఈ తనిఖీ లో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులపై ఇది వరకే గుడుంబా అమ్మకం ఫై ఇదివరకే రెండు సార్లు కేసులు నమోదు అయ్యినప్పటికి వారు తమ పద్ధతి మార్చుకోకుండా మరల గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారు, వీరు పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది.

యువకులు గంజాయి కి అలవాటు పడితే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు గంజాయి కి మరియు ఇతర చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించడం జరిగినది.

జీవితం ఎంతో విలువైనది ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం జరిగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురి అవ్వడమే గాక వారి అభివృద్ధి కుoటుపడుతుందని తెలియజేయడం జరిగింది.

పోక్సో చట్టాల గురించి, సైబర్ నేరల గురించి యువకులకి మరియు కాలనీ వాసులకి పోలీసులు అవగాహనా కల్పించినారు. ఈ కార్యక్రమం లో చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ శ్యామ్ పటేల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రత్యేక పోలీస్ బృందం 15 మంది పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR