Mancherial: భారత్ సమ్మిట్ వ్యతిరేక నిరసనలకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్!
Mancherial: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా నిరసనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
Mancherial: భారత్ సమ్మిట్ వ్యతిరేక నిరసనలకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్!
Mancherial: కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బెల్లంపల్లి మండల రూరల్ బీజేపీ నాయకులను తాళ్లగురిజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో బుడేమే విజయ్, నస్పూరి లక్ష్మణ్, గాదర్ల నగేష్, పొట్లంసేరి సాయిరాం, ఎంబడి సతీష్, సాయితేజ ఉన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
భారత్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించినందుకే నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అరెస్టులతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని, అదుపులోకి తీసుకున్న నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.




