Asifabad: రనవెల్లి వద్ద ప్రాణహిత నది ఒడ్డున పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రనవెల్లి వద్ద ప్రాణహిత నది ఒడ్డున పేకాట స్థావరాలపై పోలీసుల దాడి. 8 మంది అరెస్ట్, రూ.26,100 నగదు, 5 బైకులు సీజ్.
Asifabad: రనవెల్లి వద్ద ప్రాణహిత నది ఒడ్డున పేకాట స్థావరంపై పోలీసుల దాడి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రనవెల్లి గ్రామ శివారులో గల ప్రాణహిత నది ఒడ్డున పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నగదు రూ. 26,100 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
ఈ పేకాటను రనవెల్లి గ్రామానికి చెందిన ఆడప తిరుపతి మరియు లంబడిహట్టి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నేర స్థలం నుండి కొంతమంది పారిపోగా వారిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.




