Asifabad: పెరట్లో గంజాయి సాగు.. చింతలమానేపల్లిలో ఒకరి అరెస్ట్!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో ఇంటి పెరట్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Asifabad: పెరట్లో గంజాయి సాగు.. చింతలమానేపల్లిలో ఒకరి అరెస్ట్!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుంబారి శంకర్, తండ్రి రాములు, వయస్సు 68 సంవత్సరాలు అనే వ్యక్తి తన పెరడి స్థలంలో అక్రమంగా 9 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.
స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.60,000/- గా అంచనా వేశారు ఈ దాడుల్లో కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ చింతలమానేపల్లి సబ్-ఇన్స్పెక్టర్ కమలాకర్ పోలీస్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి నిందితున్ని రిమాండ్ కు తరలించి నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.
గంజాయి సాగు, విక్రయం, రవాణా లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి సమాచారం ఉంటే, ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.




