Mancherial: కాసిపేట ఎస్ఐ బదిలీ వ్యవహారంలో రాజకీయ జోక్యం?
Mancherial: మంచిర్యాల జిల్లా కాసిపేట ఎస్ఐ బదిలీ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఆరోపణలు. ఉత్తర్వులు వచ్చినా రిలీవ్ కాకపోవడంపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ.
Mancherial: కాసిపేట ఎస్ఐ బదిలీ వ్యవహారంలో రాజకీయ జోక్యం?
Mancherial: పోలీసు శాఖలో బదిలీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారి విధుల నుంచి రిలీవ్ కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మల్టీజోన్-1 పరిధిలోని కాళేశ్వరం డీఐజీ sept 17న నలుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వీఆర్లో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ను మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోగా నియమించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఉన్న S.I ఇంకా విధుల నుంచి రిలీవ్ కాకపోవడం చర్చకు దారితీస్తోంది.
రాజకీయ పలుకుబడే కారణమా?
ప్రస్తుతం కాసిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారి రిలీవ్ కాకుండా ఉండేందుకు రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..బదిలీ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా సంబంధిత అధికారి ఎందుకు రిలీవ్ కాలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బదిలీ అయిన అధికారి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, అదే స్టేషన్లో కొనసాగడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎందుకు?
పోలీసు శాఖలో పోస్టింగ్లు, బదిలీల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. స్థానికంగా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం, వారి అనుచరగానానికి అనుకున్న ముడుపులు ముట్ట చెప్పడం .. వారికి కావలసిన పనులు చేయడంతో వారి సిఫారసులతో కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు పొందేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాలు పోలీసు శాఖ పనితీరుపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారులు స్పందిస్తారా?
బదిలీ ఉత్తర్వులు అమలు కావడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? రాజకీయ సిఫారసులు లేకుండా విధులు నిర్వహించే అధికారులకు న్యాయం జరుగుతోందా? బదిలీ ప్రక్రియలో పారదర్శకతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించడంతో పాటు, బదిలీ ఉత్తర్వుల అమలుపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసు శాఖలో బదిలీలు, పోస్టింగ్ల విషయంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




