Chennur: చెన్నూర్ ఆయుష్ యోగ కేంద్రంలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!

Chennur: చెన్నూర్ పట్టణంలోని ఆయుష్ యోగ కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. యోగ కేంద్ర సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటారు.

RAJENDER, CHENNUR
Published on: 28 Aug 2026 10:32 AM IST
Chennur
X

Chennur: చెన్నూర్ ఆయుష్ యోగ కేంద్రంలో వైభవంగా రక్షాబంధన్ వేడుకలు!

Chennur: చెన్నూర్ పట్టణంలోని ఆయుష్ యోగ కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను చెన్నూర్ ఆయుష్ యోగ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. “నీకు నేను రక్ష. నాకు నీవు రక్ష” అనే భావనను స్మరిస్తూ యోగ కేంద్రంలో ఉన్న పురుషులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రాఖీ కట్టడం ద్వారా కేవలం అన్నదమ్ముల అనుబంధమే కాకుండా, జీవితంలో ఎల్లప్పుడూ పరస్పరం తోడుగా నిలవాలి, ఒకరికొకరు అండగా ఉండాలనే సందేశాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ పండుగ విశిష్టతను, సోదరభావం గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.

ఒకరి చేతికి మరొకరు రాఖీ కట్టి, ఆత్మీయతను పంచుకున్న ఆయుష్ యోగ కేంద్రం సభ్యులు. ప్రేమ, స్నేహం, సోదరభావానికి ప్రతీకగా సాగిన ఈ రక్షాబంధన్ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

రక్షాబంధన్ పండుగ అంటే ఒక్క అన్న & చెల్లె - అక్క & తమ్ముడే కాకుండా అన్నదమ్ములు కూడా రక్షాబంధన్ వేడుకలను జరుపుకోవచ్చని చాటిచెప్పారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story