Bellampalli: బెల్లంపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు అరెస్ట్!

Bellampalli: బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 4 Oct 2026 10:00 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు అరెస్ట్!

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో నిర్వహిస్తున్న అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.10,480 నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక హీరో హోండా సీడీ 100 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI