Ramakrishnapur: రామకృష్ణాపూర్‌లో ఉద్రిక్తత మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు

Ramakrishnapur: రామకృష్ణాపూర్ మున్సిపల్ కమిషనర్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు. చైర్‌పర్సన్, కౌన్సిలర్ల ఆందోళనతో ఉద్రిక్తత.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 July 2026 2:16 PM IST
Ramakrishnapur
X

Ramakrishnapur: రామకృష్ణాపూర్‌లో ఉద్రిక్తత మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు

రామకృష్ణాపూర్‌: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో మున్సిపల్ కమిషనర్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మొదటి వార్డులో పర్యటించిన సమయంలో సంబంధిత వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించగా కమిషనర్ అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు దళిత మహిళ అయిన చైర్‌పర్సన్‌ను కుల వివక్షతో అవమానించారని ఆరోపించారు. అంతేకాకుండా భౌతిక దాడికి యత్నించి, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి మున్సిపల్ కమిషనర్‌పై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీస్) చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు పోలీసులను కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story