Kagaznagar: ఇళ్లు కూల్చితే సిర్పూర్ అగ్నిగుండమే: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్!

Kagaznagar: కాగజ్‌నగర్‌లో పేదల ఇళ్లు కూల్చే ప్రయత్నం చేస్తే సిర్పూర్‌ను అగ్నిగుండంగా మారుస్తామని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్సీకి బహిరంగ సవాల్ విసిరారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 9 Nov 2026 5:08 PM IST
Kagaznagar
X

Kagaznagar: ఇళ్లు కూల్చితే సిర్పూర్ అగ్నిగుండమే: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్!

కాగజ్‌నగర్: పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే సిర్పూర్ నియోజకవర్గాన్ని అగ్నిగుండంగా మారుస్తామని బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కాగజ్‌నగర్ పట్టణంలో సుమారు 5 వేల మంది ప్రజలకు సంబంధించిన భూ సమస్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అధికారుల తీరును, ప్రజాప్రతినిధుల వైఖరిని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రమేయం లేకుండానే రెవెన్యూ అధికారులు పేదలకు నోటీసులు జారీ చేశారా అని ఆయన నిలదీశారు. హైకోర్టు నుంచి ఆదేశాలు రాకుండానే ఎంఆర్ఓ అధికారులు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు. నోటీసుల జారీ వెనుక తన ప్రమేయం లేదని ఎమ్మెల్సీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ తల్లి విగ్రహం వద్దైనా, ఎచౌడా వద్దైనా రావడానికి సిద్ధమని ప్రకటించారు.

నోటీసులు జారీ అయినప్పటికీ ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా.. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవచ్చు కదా అని నిలదీశారు. వేలాది మంది పేద కుటుంబాలకు సంబంధించిన భూ సమస్యపై ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో సుమారు 5 వేల మందిని ప్రభావితం చేస్తున్న ఈ భూ వివాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కోరారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR