Kagaznagar: రేవంత్ పాలనలో రైతులు అడ్డా కూలీలుగా మారారు
Kagaznagar: కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Kagaznagar: రేవంత్ పాలనలో రైతులు అడ్డా కూలీలుగా మారారు
Kagaznagar: కేసీఆర్ పాలనలో పంటలు పండించి వేలాది మందికి అన్నం పెట్టిన రైతులు నేడు రేవంత్ రెడ్డి పాలనలో అడ్డా కూలీలుగా మారారని అన్నారు భారాస రాష్ట్ర నాయకులు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.
కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భారాస ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
కుమురం భీం జిల్లాలో టైగర్ కారిడార్ పేరుతో అటవీశాఖ అధికారుల ఆగడాలు మితిమీరుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ కేవలం భారాస కార్యకర్తలను తమవైపు తిప్పుకోవడంలోనే నిమగ్నమై ఉన్నారు తప్పితే పరిపాలనను పట్టించుకోవడం లేదని అన్నారు.
పోడు భూముల కేసులో జైలుకు వెళ్లిన హరీష్ బాబు తన కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయిందని కానీ అమాయక ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోడు భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ పౌరులందరూ కూడా వీరోచిత పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.




