Mancherial: ఆల్కహాల్ టెస్టులపై ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

Mancherial: బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో లోపాలున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు డిపో ఎదుట నిరసన చేపట్టారు.

venkat
Published on: 11 May 2026 11:12 AM IST
Mancherial
X

Mancherial

Mancherial: మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధులకు హాజరయ్యే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. డ్రైవర్ రాయమల్లు మద్యం సేవించకపోయినా బ్రీత్ ఎనలైజర్ మిషన్ తప్పుగా రిపోర్ట్ చూపించిందని డ్రైవర్లు చెబుతున్నారు. మరో డ్రైవర్ విషయంలో రెండోసారి పరీక్షించగా నెగటివ్ రిపోర్ట్ రావడంతో మిషన్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, సస్పెన్షన్ బెదిరింపులు చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బస్సులు నడపబోమని డ్రైవర్లు స్పష్టం చేయడంతో పలు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

venkat

venkat

Next Story