Hyderabad: సింగరేణి భవన్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు!
Hyderabad: హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Hyderabad: సింగరేణి భవన్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు!
హైదరాబాద్: హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఘనంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి, భాష, యాసల అస్తిత్వానికి తన జీవితాన్ని ధారబోసిన ప్రజా కవి, తెలంగాణ సాంస్కృతిక సారథి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాళోజీ నారాయణరావు ఆశయాలు, జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో బుధవారం జరిగిన ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి ప్రసంగించారు. కాళోజీ నారాయణ రావు తెలంగాణ వెనుక బాటు తనంపై ఎంతో వేదన చెందుతూ, ప్రత్యేక తెలంగాణ సాధనే పరిష్కారమన్నారని, ఆ దిశగా ఆయన తన కవితల ద్వారా, రచనల ద్వారా, తెలంగాణ యాస, భాషల ద్వారా విస్తృత ప్రచారం జరిపారన్నారు.
ప్రతీ వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యలతో జీవించాలని అందుకు ప్రభుత్వాలు అవకాశం కల్పించాలని కోరుతుండే వారని, రచయితగా, ప్రజా కవిగా, పౌర హక్కుల నేతగా ఆయన చేసిన కృషి అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) మరియు మార్కెటింగ్ శ్రీ టి. శ్రీనివాస్ కాళోజీ నారాయణ రావు తెలంగాణకు చేసిన సేవలను గుర్తించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సింగరేణి భవన్ లోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.




