Asifabad: వేధింపులు ఎదురైతే భయపడొద్దు.. షీ టీంకు సమాచారం ఇవ్వండి ఎస్పీ

Asifabad: ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు కౌటాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో కాగజ్‌నగర్ షీ టీం ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 5 Aug 2026 4:51 PM IST
Asifabad
X

Asifabad: వేధింపులు ఎదురైతే భయపడొద్దు.. షీ టీంకు సమాచారం ఇవ్వండి ఎస్పీ 

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు కౌటాల మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాగజ్‌నగర్ షీ టీం ఇన్‌చార్జి ఏఎస్ఐ సునీత మాట్లాడుతూ గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, డయల్ 100, 112 సేవల వినియోగం, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

విద్యార్థినులు తమ హక్కులపై అవగాహన పెంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులకు లేదా షీ టీంకు సమాచారం అందించాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు కాగజ్‌నగర్ షీ టీం హెల్ప్‌లైన్ నంబర్ 8712670565కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామ్‌చందర్, ఉపాధ్యాయులు, షీ టీం సభ్యులు రమాదేవి, శ్రీనివాస్, సునీత తదితరులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story