Kagaznagar: కాగజ్‌నగర్‌లో దారుణం... ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం!

Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

LALITH KUMAR, SIRPUR
Published on: 13 Sept 2026 11:45 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో దారుణం... ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం!

కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారికి మేనమామ వరుసయ్యే వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహానికి గురై నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం.

నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలోనూ స్థానికులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారిపై జరిగిన ఈ ఘటనతో తీవ్ర విషాదం, ఆగ్రహం వ్యక్తమవుతోంది.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR