Mancherial: మంచిర్యాల కాంగ్రెస్‌లో కలకలం: ఆరుగురికి షోకాజ్ నోటీసులు!

Mancherial: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను అడ్డుకున్న ఘటనపై ఆరుగురు కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 7 Sept 2026 7:39 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల కాంగ్రెస్‌లో కలకలం: ఆరుగురికి షోకాజ్ నోటీసులు!

Mancherial: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో షోకాజ్ నోటీసుల కలకలం. వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం గ్రామ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ స్పందించింది.

ఎంపీ వాహనాన్ని కొందరు పార్టీ కార్యకర్తలు అడ్డుకుని నినాదాలు చేయడంతో పాటు, కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై ఆరుగురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

నోటీసులు అందుకున్న వారు 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కకుల సృజన్, అకుల దుర్గ ప్రసాద్ ఉన్నారు.

వీరంతా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులుగా ఉన్న నేపథ్యంలో.. ఈ షోకాజ్ నోటీసుల వ్యవహారం కాంగ్రెస్‌లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story