Singareni: సింగరేణి ఆస్పత్రికి పూర్వవైభవం.. డైరెక్టర్ వెంకటేశ్వర్లు

Singareni: సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు బెల్లంపల్లిలో ఆధునీకరించిన ఏరియా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 25 April 2026 3:48 PM IST
Singareni
X

Singareni: సింగరేణి ఆస్పత్రికి పూర్వవైభవం.. డైరెక్టర్ వెంకటేశ్వర్లు

Singareni: సింగరేణి ఆస్పత్రుల్లోకెల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి వైద్యసేవల్లో ఎనలేనీ విశిష్టత ఉందని, ఈ ఆసుపత్రి పై ప్రజలు పెట్టుకొన్న కలలను నిజం చేస్తానని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కే వెంకటేశ్వర్లు అన్నారు. రూ. 80 లక్షలతో మరమ్మతులు చేసి పునర్నిర్మాణంతో కొత్త రూపం ధరించిన ఆస్పత్రి భవనాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. బెల్లంపల్లి ఏరియాపత్రి వైద్య సేవారంగంలో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. అలాంటిది నేడు వైద్య సేవలు తగ్గుముఖం పట్టాయన్నారు. బెల్లంపల్లి ఆసుపత్రికి పూర్వవైవం కల్పించి కార్మిక కుటుంబాలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్మికుల సంఖ్య ప్రాతిపదికన వైద్య సేవలను ఉండరాదన్నారు.

అన్ని వసతులు, వైద్యలు, సిబ్బంది కొరత లేకుండా ఆస్పత్రిని తీర్చిదిద్దామన్నారు. సింగరేణి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కార్మికులకు ఓపికతో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య సేవలో సింగరేణి ఆసుపత్రి వైద్యులు,సిబ్బందికి ఇప్పటివరకైతే మంచి గుర్తింపు ఉందన్నారు.

సింగరేణిలో బెల్లంపల్లి ఏరియాలో కొత్త గనులు వస్తాయన్నారు. కార్మికుల రిక్రూమెంట్ కూడా పెరుగుతుందన్నారు. గోలేటి, మహావీర్ ఖని ఓపెన్ కాస్టులు వస్తాయని వెల్లడించారు. కేకే ఓసీపీ విస్తరణ కూడా జరుగుతుందన్నారు. కొంత ఆలస్యమైనా మరిన్ని గనులు రానున్నాయన్నారు. కార్మికులకు వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు.

బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి వైద్య సామర్థ్యం బలోపేతం తప్పనిసరన్నారు. సింగరేణిలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. గత వార్షిక లక్ష్యాన్ని బెల్లంపల్లి,సత్తుపల్లి ఏరియా కార్మికులు మాత్రమే సాధించారని వెల్లడించారు. అందుకుగాను రెండు ఏరియాల జీఎం లు కార్మికులను అభినందించారు. అదే స్ఫూర్తిని తో సింగరేణి యావత్తు కార్మికులు, అధికారులు పనిచేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి పెరిగితేనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ విషయంలో అందరూ భాధ్యతదా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జీఎం విజయ భాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి డివైసీఎంవో పాండురంగ చారి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య, ఏఐటీయూసీ ఆస్పత్రి ఫిట్ సెక్రటరీ శ్రీధర్, టీబీజీకేఎస్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, ఆస్పత్రి మెట్రిన్, మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story