Bellampally: సింగరేణి ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌తో కాంపౌండర్ అసభ్య ప్రవర్తన!

Bellampally: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మద్యం తాగి వచ్చి మహిళా డాక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కాంపౌండర్.

PRATHAP, BELLAMPALLI
Published on: 24 Oct 2026 9:37 AM IST
Bellampally
X

Bellampally: సింగరేణి ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌తో కాంపౌండర్ అసభ్య ప్రవర్తన!

Bellampally: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కాన్ఫిడెన్స్ నింపాల్సిన వైద్యురాలికి భద్రత కరువైంది. విధుల్లో మద్యం తాగి వచ్చి, ఓ మహిళా డాక్టర్‌తో కాంపౌండర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ అండదండలు ఉన్నాయన్న ధీమాతో సదరు ఉద్యోగి అరాచకం సృష్టిస్తున్నా, అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి."

ఇది బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి... ప్రాణాపాయంలో ఉన్న కార్మికులకు, ప్రజలకు వైద్యం అందించే ఈ పవిత్రమైన వైద్యాలయంలో కొద్ది రోజుల కిందట (అక్టోబర్ 21న) రాత్రి పూట తీవ్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ కాంపౌండర్... మత్తులో జోగుతూ, తోటి మహిళా వైద్యురాలి పట్ల అత్యంత అసభ్యంగా, ప్రవర్తించాడు.

అయితే, ఈ దారుణం జరిగి రోజులు గడుస్తున్నా బాధితురాలు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడిపోతున్నారు. కారణం... సదరు కాంపౌండర్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయని, తనకు ఏ ఆపద వస్తుందోనని ఆ మహిళా డాక్టర్ తీవ్ర ఆందోళనలో వెనకడుగు వేస్తున్నారు."సింగరేణిలో మహిళా ఉద్యోగులకు అప్పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి స్పెషల్ ఎంక్వయిరీ జరిపించాలని జీవోలు (చట్టాలు ఉన్న) అవి వాస్తవ స్థితిలో పనిచేయడం లేదు

ఈ దారుణ ఘటనపై ఆసుపత్రి వర్గాల్లో, స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నా... ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోకపోవడం గమసార్హం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి."

మహిళా ఉద్యోగుల రక్షణకు పెద్దపీట వేయాల్సిన సింగరేణి సంస్థలో... ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై తోటి మహిళా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి సీఎండీ (CMD) లేదా డైరెక్టర్ స్థాయి అధికారులు స్వయంగా జోక్యం చేసుకుని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని... మద్యం తాగి మహిళా డాక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఆ కాంపౌండర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి."

అధికారుల పర్యవేక్షణ కరువు;

బెల్లంపల్లి సింగరేణి ఏరియాస్పత్రిలో కొందరు ఉద్యోగులు రాత్రి వేళలో మద్యం సేవించి డ్యూటీ నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయం ఉన్నతాధికారి దృష్టిలో ఉన్న ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు

వైద్యురాలిగా ప్రాణాలు కాపాడే స్థానంలో ఉన్న మహిళకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం ఈ ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్ టాపిక్‌గా మారింది.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI