Mancherial: మందమర్రిలో ఐచర్ వ్యాన్‌లో సింగరేణి ఇనుప సామాగ్రి పట్టివేత!

Mancherial: మందమర్రి జీఎం కార్యాలయం సమీపంలో ఐచర్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సింగరేణి ఇనుప సామాగ్రిని ఎస్ అండ్ పీసీ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 11 Aug 2026 11:24 PM IST
Mancherial
X

Mancherial: మందమర్రిలో ఐచర్ వ్యాన్‌లో సింగరేణి ఇనుప సామాగ్రి పట్టివేత!

మంచిర్యాల: సింగరేణి కి సంబంధించి ఇనుప సామాగ్రి వ్యానును దొంగతనంగా తరలిస్తుండగా మందమర్రి ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం స్వాధీనం చేసుకున్నామని సెక్యూరిటీ ఆఫీసర్ కె వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కి సంబంధించిన ఇనుప సామాగ్రి ని బెల్లంపల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారి ఎస్.కే. సలీమ్, ఏపీ 15 టీబి 4555 నంబర్ గల ఐచర్ వ్యాన్‌లో తరలిస్తుండగా మందమర్రి జిఎం కార్యాలయం సమీపంలో పట్టుకున్నామని తెలిపారు.

ఇనుప సామాను ఐచర్ వ్యాన్ లో తరలిస్తున్నారని ఇంటలిజెన్స్ కే శ్రీనివాస్ రావుకి నమ్మదగిన సమాచారం మేరకు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి జూనియర్ ఇన్స్పెక్టర్ బోయిన ఓదెలు, ఎస్ కే దాస్, జమిదర్ జి రాజయ్య ఇనుప సామాగ్రి వ్యాన్ వెంబడించి పట్టుకోమన్నారూ.

వ్యాన్‌ను ఎస్ అండ్ పిసి ఆఫీస్‌కు తరలించి దాని పరదా తీసి పరిశీలించగా అందులో సింగరేణికి చెందిన రోలర్స్, స్టాండ్స్ ఇతర ఇనుప సామాగ్రి ఉన్నాయని అన్నారు.అనంతరం సింగరేణి సామాగ్రితో ఐచర్ వ్యాన్ ను మందమర్రి పోలీస్ స్టేషన్కి ఇతరులించామని తెలియజేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story