Sirpur: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల దీక్షకు CITU మద్దతు

Sirpur: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల 66 రోజుల రిలే దీక్షకు మద్దతు తెలిపిన CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్. కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలని డిమాండ్.

LALITH KUMAR, SIRPUR
Published on: 24 July 2026 8:18 PM IST
Sirpur
X

Sirpur: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల దీక్షకు CITU మద్దతు

సిర్పూర్: సిర్పూర్ పేపర్ మిల్లులో గత 66 రోజులుగా SPM కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి (JAC) ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరహార దీక్షలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్పూర్ పేపర్ మజ్దూర్ యూనియన్ e 2510 జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సమ్మె శిబిరానికి చేరుకొని మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని 10 మెంబర్ కమిటి వెంటనే రద్దు చేయాలన్నారు కార్మికులను పూర్తిస్థాయి లో విధులకు తీసుకోవాలని సోసైటి డబ్బులపై ప్రభుత్వ ప్రత్యేక అధికారి తో విచారణ జరిపించాలి.

క్యాంటిన్ ప్రభుత్వ నిర్ణీత ధరలకై ఇవ్వాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి NCLT కోర్టు డబ్బులపై విచారణ జరిపించాలి అగ్రిమెంట్ కాఫీ విడుదల చేయాలి వార్షిక బోనస్ పై కార్మిక శాఖ అధికారి విచారణ జరిపించాలి కాంట్రక్ట్ కార్మికుల G.Oను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

నోయిడా కార్మికులు తమ హక్కులను సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించారని అదేవిధంగా సిర్పూర్ పేపర్ మిల్లు రిలే నిరాహార దీక్షలు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు ఈ కార్యక్రమంలో SPM కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి (JAC) నాయకులు పెద్దసంఖ్యలో పేపర్ మిల్ కార్మికులు పాల్గొని జయప్రదం చేశారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story