Asifabad: కుష్ణపల్లి ఒర్రె వద్ద ఉధృత వరదలు.. పరిశీలించిన సిర్పూర్ ఎమ్మెల్యే

Asifabad: బెజ్జూర్ లో కుష్ణపల్లి ఒర్రె వరద ప్రాంతాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించి, అటవీ అనుమతులపై అసెంబ్లీలో సీఎంను కలుస్తామని తెలిపారు.

SRINIVAS, KOUTALA
Published on: 30 July 2026 5:36 PM IST
Asifabad
X

Asifabad: కుష్ణపల్లి ఒర్రె వద్ద ఉధృత వరదలు.. పరిశీలించిన సిర్పూర్ ఎమ్మెల్యే

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుష్ణపల్లి శివారులో ఒర్రె వరదలకు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ అటవీ శాఖ అనుమతులు రాక బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయిందని తెలిపారు.

వచ్చే నెలలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించి అటవీ అనుమతులు సాధిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్ రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పాషా, ఏవో నాగరాజు, సర్పంచ్ వడ్డేపల్లి శ్రీనివాస్, నాయకులు సామల తిరుపతి, గడ్డం రాజేష్,పొన్న ప్రవీణ్, నికాడి రమేష్, వసి ఉల్లా ఖాన్, మెస్రం రాజారామ్, గూడ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story