Sirpur: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు అంగన్‌వాడీల వినతి

Sirpur: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ బాబుకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వినతిపత్రం అందజేసింది.

LALITH KUMAR, SIRPUR
Published on: 20 May 2026 6:19 PM IST
Sirpur
X

Sirpur: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు అంగన్‌వాడీల వినతి

Sirpur: కుమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. త్రివేణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. వేతనాలు ఆలస్యమవడంతో వేలాది మంది మహిళా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే ఏప్రిల్ నెల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ ఉద్యోగులు గత 50 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఇప్పటికీ సరైన వేతనాలు, చట్టబద్ధ హక్కులు, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.18,000 వేతనం, పీఎఫ్ సౌకర్యం తదితర హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

అలాగే ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని, ప్రీ ప్రైమరీ – పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్ఈపీ–2020 విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులపై సంబంధం లేని పనులు, బిఎల్‌ఓ డ్యూటీలు మోపకూడదని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న సమ్మె వేతనాలు, పీఆర్సీ ఎరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయాలా టీచర్స్ మధ్యలో జీత వ్యత్యాసం అధికంగా ఉందిని అది దనిని తగ్గించాలి అనీ అన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story