Sirpur: అంబగట్ట గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు!

Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని అంబగట్ట గట్టు చెరువును సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 19 May 2026 4:45 PM IST
Sirpur
X

Sirpur: అంబగట్ట గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు!

Sirpur: కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలోని అంబగట్ట గట్టు చెరువు శిధిలావస్థకు చేరుకోవడంతో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. రెండు కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ చెరువు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే కాకుండా పశువులు, అటవీ జంతువులకు తాగునీటి వనరుగా ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

చెరువు కట్ట, మత్తడి పరిస్థితిని పరిశీలించిన ఆయన వెంటనే అంచనాలు సిద్ధం చేసి నివేదిక అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తాటివాడలో శిధిలావస్థకు చేరిన రోడ్ డ్యామ్‌ను పరిశీలించి రూ.45 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామని, త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story