Kagaznagar: కాగజ్ నగర్‌లో జగద్గురువుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే!

Kagaznagar: కాగజ్ నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్‌లో ఈ నెల 16న జరగనున్న జగద్గురువులు నరేంద్రాచార్య స్వామి వారి సభా ప్రాంగణ ఏర్పాట్లను సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 14 Nov 2026 3:56 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్ నగర్‌లో జగద్గురువుల సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే!

Kagaznagar: కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు గ్రౌండ్ లో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్రాచార్య వారి దర్శనం తేదీ:16-11-26 (సోమవారం) జరగనున్న దరిమిలా సభ మరియు మండప ఏర్పాట్లను కాగజ్ నగర్ డీఎస్పీ వహిదుద్దీన్ కలిసి ఏర్పాట్లను పరివేక్షించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం నుండే కాకుండా పక్కన ఉన్న ఆసిఫాబాద్ మరియు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, వారందరికీ దర్శన ఏర్పాట్లతో పాటు పార్కింగ్ మరియు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. జగద్గురువుల ఆశీస్సులు పొందడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కుమార స్వామి, పీఠ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR